Allu Aravind : ఆ నలుగురిలో నేను లేను : అల్లు అరవింద్
టాలీవుడ్ లో థియేటర్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
టాలీవుడ్ లో థియేటర్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆ నలుగురిలో నేను లేనని ఆయన తెలిపారు. ఆ నలుగురు ఇప్పుడు పది మంది వరకూ అయి ఉంటారని అన్నారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని, ఏపీ, తెలంగాణలో మొత్తం పదిహేను వందల థియేటర్ల వరకూ ఉంటే అందులో ఇప్పుడు నాకు పదిహేను మాత్రమే ఉంటాయని చెప్పారు. తన వృత్తి సినిమాలను నిర్మించడమేనని అన్నారు. తాను ఎప్పడో ఆ నలుగురి నుంచి బయటకు వచ్చానని తెలిపారు.
ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంతో...
జూన్ ఒకటో తేదీ నుంచి మూసివేస్తానని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై సినిమాటోగ్రఫీ మంత్రి చేసిన వ్యాఖ్యలు తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తాను ఏ మీటింగ్ కు వెళ్లలేదని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతుండగా థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసమని అన్నారు. సినీ పరిశ్రమకు మేలు చేసే వ్యక్తి అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదిహేను థియేటర్లలో ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. చంద్రబాబును టాలీవుడ్ పెద్దలు కలవక పోవడానికి కారణాలు ఏంటో తనకు తెలియదన్నారు.