సలార్ కోసమే ఆ మూవీని డిలీట్ చేశారా..? నెట్టింట హాట్ టాపిక్..!

ప్రభాస్ సలార్ కోసమే ఆ మూవీని ఓటీటీ అండ్ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి డిలీట్ చేశారా..?

Update: 2023-10-01 09:15 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటడ్ మూవీ 'సలార్' (Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ మూవీ రిలీజ్ కోసం ఇప్పుడు ఒక సినిమాని ఓటీటీ అండ్ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి డెలీట్ చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.

సలార్ సినిమా కథ గురించి గత కొంతకాలంగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ.. కన్నడ సూపర్ హిట్ చిత్రం 'ఉగ్రమ్'కి రీమేక్ గా వస్తుందని. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2014 లో వచ్చిన ఈ మూవీ కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదే కథలో కొన్ని చేంజస్ చేసి ప్రభాస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, మొన్నటివరకు ఓటీటీ అండ్ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్న 'ఉగ్రమ్' మూవీ హిందీ వెర్షన్ ఇప్పుడు కనిపించడం లేదు.
దీంతో సలార్, ఉగ్రమ్ కి రీమేక్ అన్న రూమర్ కి మరింత బలం చేకూరింది. ఉగ్రమ్ స్టోరీ విషయానికి వస్తే.. "తనకి చిన్నప్పుడు సహాయం చేసిన మిత్రుడు కోసం హీరో క్రైమ్ సిండికేట్ లోకి దిగి ఒక గ్యాంగ్ స్టార్ గా మారతాడు. అయితే ఒక సమయంలో ఆ స్నేహితుడుతోనే గొడవ జరగడంతో ఆ గ్యాంగ్ స్టార్ లైఫ్ ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు హీరో. అలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎలా వచ్చింది. ఆ తరువాత హీరో మళ్ళీ క్రైమ్ సిండికెట్ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ". మరి ప్రశాంత్ నీల్ ఇదే కథతో వస్తున్నాడా? అనేది తెలియదు గాని.. ప్రస్తుతం సలార్ అండ్ ఉగ్రమ్ కి కొన్ని పోలికలు పెడుతూ పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News