సలార్ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Update: 2023-09-29 05:57 GMT

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న మూవీ 'సలార్' (Salaar). హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్ లుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే కొన్ని అనుకోని కారణాలు వల్ల ఈ సినిమాని పోస్టుపోన్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అభిమానులంతా ఎంతో నిరాశ చెందారు.

ఇక వాయిదా వేస్తున్న సంగతి చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం తెలియజేయలేదు. ఈ విడుదల తేదీ పై నెట్టింట అనేక వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక ఇటీవల ఈ మూవీ క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 22న రావడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతల నుంచి ఎగ్జిబిటర్లకు ఒక మెయిల్ కూడా వెళ్ళిందంటూ.. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేశాడు.
ఆ విడుదల తేదీని మూవీ టీం సెప్టెంబర్ 29న అధికారికంగా తెలియజేయనుందని కూడా పేర్కొన్నాడు. తాజాగా చిత్ర యూనిట్ నేడు ఆ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీని పార్ట్-1 'సీజ్ ఫైర్'ని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అలాగే ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో మోస్ట్ వియోలెంట్ గా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ని మించిన వియోలెన్స్ ఈ మూవీలో చూపిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా క్రిస్ట్మస్ కి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'డుంకి' కూడా రిలీజ్ ఉంది. దీంతో ఈసారి పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ అండ్ షారుఖ్ మధ్య గట్టి పోటీ కనిపించబోతుంది. మరి వీరిద్దరిలో ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి. సలార్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, సప్తగిరి, జాన్సీ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Tags:    

Similar News