ప్రభాస్ సలార్ ఆ రికార్డు సృష్టిస్తుంది..?

ప్రభాస్ సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే ఈ మూవీ ఆ రేర్ రికార్డుని..

Update: 2023-08-26 12:00 GMT

బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas), కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్‌డ్ మూవీ 'సలార్' (Salaar). రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘Ceasefire’ వచ్చే నెల సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) తన డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.


ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే.. అమెరికాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. టీజర్ తో భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అయ్యిపోయాయి. ఇప్పటివరకు అయిన బుకింగ్స్ మూవీ $300K (మూడు వందల వేలు డాలర్స్) రాబట్టింది. రిలీజ్ కి ఇంకో నెల సమయం ఉంది. ఈలోపు ట్రైలర్ కూడా వస్తుంది. దీంతో ఈ చిత్రం కేవలం ప్రీ బుకింగ్స్ తోనే $1M (ఒక మిలియన్ డాలర్స్) రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినిమా విశ్లేషకులు.

మరి ఈ రికార్డుని సలార్ సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్.. వచ్చే వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గాని వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా కనిపించబోతున్నాడట.
సెకండ్ పార్ట్ లో జగపతిబాబు ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నాడు. Ceasefire చివరిలో జగపతిబాబు పాత్ర పరిచయం చేయనున్నారట. అలాగే ప్రముఖులు నటులు టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, సప్తగిరి, జాన్సీ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.


Tags:    

Similar News