కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసారు
కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ప్రభాస్ సినిమాలో ఎప్పటి నుండి కనిపిస్తారో చెప్పి సినిమాకు హైప్ పెంచేశారు.
కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ప్రభాస్ సినిమాలో ఎప్పటి నుండి కనిపిస్తారో చెప్పి సినిమాకు హైప్ పెంచేశారు. సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ సీన్ తరువాత సినిమా స్థాయి వేరే లెవెల్‌కు వెళ్తుందన్నారు. ప్రభాస్ ఎంట్రీతో మోహన్ బాబు సీన్, విష్ణు సీన్ ఇలా అర్దగంట సేపు అందరి సీన్లు అదిరిపోతాయన్నారు. ప్రభాస్ సీన్లు పూర్తయిన తరువాత క్లైమాక్స్‌లో విష్ణు నటన చూసి నా కళ్లు చెమ్మగిల్లాయన్నారు. ఇక విష్ణు డబ్బింగ్ కూడా బాగా చెప్పాడని ప్రశంసించారు బీవీఎస్ రవి. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా క్లైమాక్స్ నిలిచిపోతుందని సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదలవ్వనుంది.