Prabhas : మళ్ళీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్ వివాదం.. రచయిత కామెంట్స్..

ప్రభాస్ ఆదిపురుష్ దేశవ్యాప్తంగా ఎంతటి వివాదం అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ వివాదం..

Update: 2023-11-10 12:31 GMT

Prabhas : ప్రభాస్ రాముడిగా కనిపిస్తూ నటించిన సినిమా 'ఆదిపురుష్'. భారతీయులు అత్యంత అమితంగా పూజించే రాముడి కథ కావడంతో ఈ సినిమా పై అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ద్వారా రామాయణ కథ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలియజేస్తామంటూ మేకర్స్ చెప్పడంతో.. మూవీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించిన ఈ సినిమా.. ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయ్యింది.

ఇక థియేటర్స్ కి ఎన్నో అంచనాలతో వెళ్లిన అభిమానులకు షాక్ తగిలింది. రామాయణ కథ అని చెప్పి.. దర్శకనిర్మాతలు ఇష్టమొచ్చినట్లు తీశారు. దేవుడిగా భావించే ఆంజనేయుడు నోటి నుంచి మాస్ డైలాగ్స్ చెప్పించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ డైలాగ్స్ గురించి ప్రశ్నిస్తే.. రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్ల మొదటిలో తన డైలాగ్స్ ని సమర్ధించుకుంటూ బదులిచ్చారు. ఆ తరువాత కూడా పలు ఇంటర్వ్యూలో పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఆదిపురుష్ లో తను ఎన్నో గొప్ప మాటలు రాశానని, కానీ ఎవరు వాటిని ప్రశంసించలేదని, కేవలం తప్పుగా రాసిన ఒక ఐదు డైలాగ్స్ పట్టుకొని విమర్శిస్తున్నారని, అసలు వారు తీసిన ఆదిపురుష్ రామాయణ కథే కాదని మనోజ్ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అలా ఆ వివాదం కొన్నాళ్ళు పాటు కొనసాగి ముగిసిపోయింది అనుకుంటే.. ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చింది. తాజాగా ఒక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్.. ఆదిపురుష్ వివాదం గురించి మాట్లాడారు.
మనోజ్ ముంతాషీర్ కామెంట్స్.. "ఆదిపురుష్ కోసం నేను డైలాగ్స్ బాగా రాశాను అనుకున్నాను. నన్ను నేనే పొగుడుకున్నాను. కానీ తెలియకుండానే నేను తప్పు చేసేశాను. సనాతన ధర్మాన్ని తప్పుగా చూపించాలనేది నా ఉద్దేశం కాదు. నేను చేసిన తప్పుని గమనించ లేకపోయాను. ఆ తప్పుని అందరూ ప్రశ్నిస్తున్నా వాటికీ సరిగ్గా సమాధానం ఇవ్వకుండా నేను ప్రవర్తించిన తీరు కూడా తప్పే. ఈ విషయం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇకపై ఇలాంటివి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాస్తాను" తప్పు తెలుసుకొని మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


Tags:    

Similar News