Pawan Kalyan : పవన్ సంతకం చేశారా? ఇక ఫ్యాన్స్ కు పూనకాలేనట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. మరో సినిమాకు ఓకే చెప్పిన సమాచారం వైరల్ గా మారింది

Update: 2025-06-18 07:05 GMT

జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్టయిక్ రేట్ తో అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు. గాజు గ్లాసు గుర్తు దక్కడం చాలు గెలిచిపోయారు. అలా పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత రాజకీయాల్లో హిస్టరీని క్రియేట్ చేశారు. అయితే అదే సమయంలో పవన్ అభిమానులు మాత్రం పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. రాజకీయాలు, సినిమాలు రెండు కళ్లుగా ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు.

సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతారని...
అలాంటిది పవన్ కల్యాణ్ ఇక సినిమాల్లో నటించరన్న అభిమానుల నిరాశకు పవన్ కల్యాణ్ చెక్ పెడుతున్నారు. త్వరలోనే కొత్త సినిమాకు ఆయన సైన్ చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఓజీ అంటే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం.. సీఎం.. ఓజీ..ఓజీ అన్న నినాదాలు వినిపిస్తాయి.
సముద్ర ఖని దర్శకత్వంలో...
తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత పవన్ ఇప్పటి వరకూ అగ్రిమెంట్ చేసిన సినిమాలన్నీ పూర్తయినట్లే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కల్యాణ్ మరోసినిమాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. సముద్ర ఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు చెబుతున్నారు. సముద్ర ఖని చెప్పిన కథకు ఫ్లాట్ అయిన పవన్ వెంటనే చేద్దామని చెప్పారని, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళుతుందంటున్నారు.మరి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇది పూనకాలు తెప్పించే వార్త అనిచెప్పాలి.


Tags:    

Similar News