అదిరిపోయిన పవర్ గ్లాన్స్.. తొడకొట్టిన తెలుగోడు

ఈ పవర్ గ్లాన్స్ లో పవన్ కొంతమంది వస్తాదులతో పోరాడి వారిని కట్టికరిపిస్తున్న దృశ్యాలు చూపించారు. విజయనాదం..

Update: 2022-09-02 11:39 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ నిర్మాణంలో రాబోతోన్న సినిమా "హరిహర వీరమల్లు". నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ వీడియోను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం సినిమా నుంచి పవర్ గ్లాన్స్ విడుదల చేస్తామని చెప్పిన చిత్ర బృందం.. మధ్యాహ్నమే విడుదల చేసి పవర్ స్టార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ పవర్ గ్లాన్స్ లో పవన్ కొంతమంది వస్తాదులతో పోరాడి వారిని కట్టికరిపిస్తున్న దృశ్యాలు చూపించారు. విజయనాదం చేస్తూ పవన్ తొడకొట్టే సీన్ ను వీడియోలో చూడొచ్చు. బ్యాగ్రౌండ్లో తొడగొట్టిన తెలుగోడు అంటూ వచ్చే మ్యూజిక్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. "మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకుని తొడకొట్టాడో తెలుగోడు" అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
పవర్ గ్లాన్స్ వీడియో విడుదలైన కొద్దిసేపటికే రెండు మిలియన్ల పైగా వ్యూస్ తెచ్చుకుంది. రేపటికి ఈ వీడియో కొత్తరికార్డు సృష్టిస్తుందని పవన్ అభిమానులు అంటున్నారు. కాగా.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, అభిమానులు రక్తదానం చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు.

Full View

Tags:    

Similar News