రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ..?

రాకేష్ మాస్టర్ చాలా రోజుల నుండి అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ అనాథశరణాలయంలో ఉంటున్నారు. రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు

Update: 2023-06-19 02:29 GMT

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక ప్రోగ్రాం షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం కు వెళ్లిన రాకేష్ మాస్టర్ తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గాంధీ హాస్పిటల్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డయాబెటిక్ పేషంట్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. రక్త విరోచనాలు అవుతున్నాయని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డయాబిటిక్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో రాకేశ్ మాస్టర్‌ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆయన్ను బతికించాలని డాక్టర్ల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ మృతిచెందారని గాంధీ ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మీడియాకు వెల్లడించారు.

రాకేష్ మాస్టర్ చాలా రోజుల నుండి అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ అనాథశరణాలయంలో ఉంటున్నారు. రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. జూన్ 19న బోరబండలో రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి. రాకేష్ మాస్టర్ గతంలో పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలలో తను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియోను ముందే తీశామని కూడా తెలిపాడు. తన భార్య తండ్రి సమాధి పక్కన ఒక వేప మొక్కను నాటాడట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ కోరాడు. ఇప్పుడు ఆ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
1968 తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్.రామారావు. తెలుగు సినీ పరిశ్రమలో 1500 సినిమాలకు పైగా పనిచేశారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పని చేశారు. ఆయన శిష్యులు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పొజిషన్ లో ఉన్నారు.


Tags:    

Similar News