Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తీపికబురు.. అడ్వాన్స్ బుకింగ్ప్ ఓపెన్ అవుతున్నాయట
వచ్చే నెల 25వ తేదీన పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల కానుంది. దీంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో బ్లాక్ బస్టర్స్ తక్కువ. డిజాస్టర్ లు ఎక్కువ. అయినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్ బేస్ మాత్రం చెక్కు చెదరలేదు. ఆయనకంటూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. వారికి హిట్, ఫ్లాప్ లతో సంబంధం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టినా పవన్ కల్యాణ్ ప్రతి కొత్త సినిమాకు అంతే బజ్ ఉంటుంది. ఏమాత్రం క్రేజ్ తగ్గదు. తగ్గబోదు. ఇటీవల విడుదలయిన హరిహర వీరమల్లు మూవీ డిజాస్టర్ అయినప్పటికీ మరో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే నెల 25వ తేదీన...
వచ్చే నెల 25వ తేదీన పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల కానుంది. దీంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరమల్లు మూవీ నిరాశ నుంచి బయటపడిన ఫ్యాన్స్ మళ్లీ ఓజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్లినా అక్కడ సీఎం.. సీఎం అనే నినాదాలతో పాటు ఓజీ .. ఓజీ అనే నినాదాలు వినిపించడం కామన్ అయిపోయాయి. అయితే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 25వ తేదీన విడుదలవుతుండటంతో ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఈ నెల 29వ తేదీ నుంచి...
కానీ ఓవర్సీస్ లో ఈ నెల 29వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానున్నాయని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రతంగిరా సంస్థ ప్రకటించింది. సెప్టంబరు 24వ తేదీన ప్రీమియర్ షోలు ఉండటంతో పాటు టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్ తేదీలు కూడా ఖరారు కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. పవన్ కు ఉన్న ప్రత్యేక క్రేజ్ ఈ మూవీని ఎక్కడికో తీసుకెళుతుందని సినీ వర్గాలు సయితం అంచనా వేస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ షేడ్ ఉన్న పాత్రలో పవన్ కల్యాణ్ కనిపిస్తుండటంతో పాటు ఇప్పటి వరకూ విడుదలయిన గ్లింప్స్ మరింత ఆసక్తిని పెంచాయి. యాక్షన్ సినిమాగా తెరకెక్కే ఓజీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదే స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఫ్యాన్స్ సంబరాలు బిగిన్ అయ్యారు.