పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలు.. రీ రిలీజ్ కు రెడీ అవుతోన్న "తొలిప్రేమ"

ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మార్క్ కామెడీ, అతని క్యారెక్టర్ ఆకట్టుకుంది. దానికితోడు ఫీల్ గుడ్..

Update: 2023-05-24 13:20 GMT

toliprema 25 years celebrations

టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు. అభిమాన హీరో అయితే చాలు.. స్టోరీ పరంగా ఫ్లాప్ అయినా.. ఆ సినిమాలో హిట్ సాంగ్స్ కోసం థియేటర్లలో స్టెప్పులేసేందుకైనా వెళ్తున్నారు. అప్పుడు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. ఇప్పుడు మాత్రం రీ రిలీజ్ లతో కోట్లు వసూలు చేస్తున్నారు. తాజాగా 90 లలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ కూడా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఏ హీరో సినిమా రీ రిలీజ్ అయితే ఆ హీరో అభిమానుల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ.. పవన్ సినిమా రిలీజైనా, రీ రిలీజ్ అయినా అభిమానులు, జన సైనికుల రచ్చ మామూలుగా ఉండదు. ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మార్క్ కామెడీ, అతని క్యారెక్టర్ ఆకట్టుకుంది. దానికితోడు ఫీల్ గుడ్ సాంగ్స్ కూడా. ఇప్పటికీ తొలిప్రేమ సాంగ్స్ చాలామంది ప్లే లిస్ట్ లో ఉంటాయి. చెల్లెలి సెంటిమెంట్, ప్రియురాలి కోసం హీరో పడే తపన తొలిప్రేమకు హైలెట్ అని చెప్పాలి. కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. యువతను, ఫ్యామిలీని అలరించిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. జూన్‌ 30న 4K ప్రింట్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు.




Tags:    

Similar News