Pawan Kalyan : ఓజీ ఓకే.. ఉస్తాద్ మాటేమిటి.. ఇదిగిదిగో అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు

Update: 2025-10-04 06:40 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే ఈ మూవీకి సంబంధించి మెగా అప్ డేట్ వస్తుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ నటించిన సుజిత్ దర్శకత్వంలో తమన్ సంగీతదర్శకత్వంలో విడుదలయిన ఓజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతున్న సమయంలో ఓజీ థ్రిల్ నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తేరుకోకమునుపే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై కూడా దీపావళికి బిగ్ అప్ డేట్ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

షూటింగ్ కొనసాగుతుండటంతో...
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా రోజుల నుంచి షూటింగ్ జరుగుతుంది. పవన్ కల్యాణ్ కు వీలున్నప్పుడల్లా షూటింగ్ లో పాల్గొంటూ చిత్రాన్ని కంప్లీట్ చేసేందుకు సహకరిస్తున్నారు. ఇటీవలే వైరల్ ఫీవర్ తో బాధపడుతూ తిరిగి రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ కల్యాణ్ కొద్ది రోజుల తర్వాత షూటింగ్ లో కనిపించబోతున్నారట. మాస్ క్యారెక్టర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కనిపించనున్నారు. ఈ మూవీ విడుదల తేదీని దీపావళి రోజున మేకర్స్ రివీల్ చేస్తారని చెబుతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ దీపావళి కోసం ఎదురు చూస్తున్నారు.
వచ్చేఏడాది వేసవిలోనే...
ఈ మూవీని 2026 వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జనవరి సంక్రాంతి పండగకు చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్ ఉంది. అందుకే మార్చిచివర, లేదా ఏప్రిల్ లో ఈ మూవీ విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లు. దేవీశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీత దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ను నిర్మిస్తున్నారు.









Tags:    

Similar News