Pawan Kalyan : వివాదంలో పవన్ సినిమా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి..

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వివాదంలో చిక్కుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సినిమాలో..

Update: 2024-03-21 06:55 GMT
Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరోసారి నటిస్తూ చేస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. కొన్ని రోజుల మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం పవన్ తన తన పొలిటికల్ షెడ్యూల్స్ లో బిజీగా ఉండడంతో షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. గబ్బర్ సింగ్ డేస్ ని గుర్తు చేస్తూ ఉన్న ఈ టీజర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఈ టీజర్ లో పవన్ చెప్పిన రెండు పొలిటికల్ డైలాగ్స్ జనసైనికులకు బాగా నచ్చేసాయి. ఆ డైలాగ్స్ ఏంటంటే.. 'గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం', 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది'. అయితే ఇప్పుడు ఈ డైలాగ్స్ రాజకీయంగా చర్చినీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇలాంటి సమయంలో టీజర్ లో జనసేన పార్టీ ప్రచారానికి తగ్గట్టు ఉన్న ఆ డైలాగ్స్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ విషయం పై ఏపీ సిఈఓ ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. తాను ఇంకా టీజర్ చూడలేదని, చూసిన తరువాత దాని పై చర్యలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఒకవేళ నిజంగా టీజర్ లో రాజకీయ ప్రచారాంశంతో డైలాగ్స్, సీన్స్ ఉంటే మూవీ ఈసీకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి టీజర్ చూసిన తరువాత ముకేశ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి. దీంతో తరువాత ఏం జరుగుతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది.
Full View
Tags:    

Similar News