బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మొదలైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ప్రేమ..

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం అయ్యిపోయింది. ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో తెలియజేశారు.

Update: 2023-09-25 05:47 GMT

కొన్నాళ్లుగా బాలీవుడ్ లో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. ఈ ఏడాది మే నెలలో నిశ్చితార్థం చేసుకొని ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకున్న ఈ జంట.. తాజాగా ఏడడుగులు వేసి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టారు. నిన్న సెప్టెంబర్ 24న వీరిద్దరి వివాహం రాజస్ధాన్‌ లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. 22న మొదలైన ఈ వివాహ వేడుక హల్దీ, మెహందీ, సంగీత్ అంటూ అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రీడా రంగంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరుకావడం. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ వివాహానికి వచ్చి కొత్త జంటకి తమ అశీసులు అందించారు. ఇక ఈ కొత్త జంటని ‘రాగ్‌ణీతి’ అంటూ పిలుస్తూ నెటిజెన్స్.. సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ కొత్త జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ప్రయాణం ఎలా మొదలైందో చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర చాటింగ్ తో వీరిద్దరి ప్రయాణం మొదలైందట. ఇక ఈ పెళ్లి రోజు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా పరిణీతి, రాఘవ్‌ ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారట. అలాగే ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉందని సమాచారం. ఇన్నాళ్లు డిన్నర్ పార్టీలు, క్రికెట్ మ్యాచ్స్ అంటూ పలు చోట్ల జంటగా కనిపిస్తూ సందడి చేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకొని మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యారు. కాగా వీరిద్దరి పెళ్ళికి సుమారు 90 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది.


Tags:    

Similar News