కృష్ణ వ్రింద విహారి ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పటి నుండి అంటే..?

Update: 2022-10-12 07:32 GMT

నాగశౌర్య హీరోగా దర్శకుడు, అనీష్ కృష్ణ తెరకెక్కిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. చాలా రోజులుగా హిట్ లేకుండా నాగశౌర్యకు మంచి హిట్ ను అందించింది. ఇప్పటికే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' కొనుగోలు చేసింది. ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే.

షిర్లే సేతియా, రాధిక శరత్ కుమార్, అన్నపూర్ణ, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు సినిమాలో తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఛలో తర్వాత సరైన సక్సెస్ లేకుండా ఉన్న నాగశౌర్యకు మంచి కమర్షియల్ హిట్ ను అందించిన సినిమా కృష్ణ వ్రింద విహారి. గతేడాది 'వరుడు కావాలెను', 'లక్ష్య' సినిమాలు నాగ శౌర్యకు ఫ్లాప్ లను మూటగట్టినా.. ఈ ఏడాది మాత్రం హిట్ దక్కింది. సనాతన బ్రాణ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో ఉన్న ఊరి నుంచి హైదరాబాద్ వస్తాడు. అక్కడ కంపెనీలో అతిని టీమ్ లీడర్‌గా వ్రిందా(షిర్లే)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తనకు బాస్ పొజిషన్‌లో ఉన్న వ్రిందాతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంప్రదాయ కుటుంబానికి చెందిన హీరో ఫ్యామిలీ ఒప్పుకుందా.. లేదా అంటూ అల్లుకున్న కథనే 'కృష్ణ వ్రిందా విహారి'. ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను, థియేటర్లలో మిస్ అయిన వారిని ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లోకి వచ్చేస్తోంది.


Tags:    

Similar News