సైమా అవార్డుల విజేతలు వీరే

ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి. మృణాల్ ఠాకూర్ కు ఉత్తమ పరిచయ నటి అవార్డు దక్కింది

Update: 2023-09-16 02:31 GMT

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక దుబాయిలో జరిగింది. ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. ‘RRR’లో ఆయన నటనకు గానూ అవార్డు వరించింది. ‘ధమకా’లో నటనకు శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి. మృణాల్ ఠాకూర్ కు ఉత్తమ పరిచయ నటి అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటుడు అవార్డు దగ్గుబాటి రానాకు దక్కింది. భీమ్లా నాయక్ సినిమాకు గానూ రానాకు ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక కొత్త దర్శకుడుగా సత్తా చాటిన బింబిసార దర్శకుడు వశిష్టకు అవార్డు దక్కడం విశేషం.

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నేను పడిపోయిన ప్రతిసారీ నన్ను పైకి లేపి పట్టుకున్నందుకు, నా కళ్లలో నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కకు బాధపడ్డందుకు, నాతో పాటు నవ్వినందుకు అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను." అంటూ చెప్పుకొచ్చారు. నలుపు రంగు డ్రెస్ లో ఎన్టీఆర్ కనిపించాడు.


Tags:    

Similar News