అదిరేటి అప్డేట్ వచ్చేసింది.. సమయం వచ్చిందంటున్న ఎన్టీఆర్

Update: 2022-05-19 14:44 GMT

జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల కోసం సినిమా బృందం స్పెషల్ వీడియోను రూపొందించింది. సముద్రమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు రెండు చేతుల్లో కత్తులతో ఎన్టీఆర్ నిలబడి ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ను మాత్రమే చూపించారు. అంతే తప్ప ఫేస్ ను రివీల్ చేయలేదు. రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని "అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి కూడా తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా".. అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తూ ఉండగా.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను వినవచ్చు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నాయి. కొరటాల శివ ఈ సారి యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపడం పక్కా అని అంటున్నారు.

ఎన్టీఆర్ పలికిన డైలాగ్... చేతుల్లో కత్తులతో సముద్రం మధ్యలో నిలుచున్న తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మాస్ సినిమా అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు . శుక్రవారం (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో #NTR 30 సినిమా నుంచి ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజి హీరో అవ్వడంతో మిగిలిన మార్కెట్స్ పై కూడా ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఇక సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News