నిహారిక విడాకులు.. సోషల్ మీడియాలో ఈ రెండింటి కోసం తెగ వెతికేశారు

2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట కాపురం..

Update: 2023-07-05 05:06 GMT

మెగా బ్రదర్, ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక - భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంది. నిన్న రాత్రి నుంచీ ఇదే టాప్ ట్రెండింగ్ టాపిక్ అయింది. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. పెళ్లైన కొన్నినెలలకే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించే నిహారిక-చైతన్య లు విడిపోవడం మెగా ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ఏదేమైనా.. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వారు స్ట్రాంగ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక పేరు నిన్నటి నుంచి మారుమ్రోగుతున్నా.. ఈ విషయంపై ఆమె ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

కాగా.. నిహారిక-చైతన్య లు విడాకులకు కూకట్ పల్లి ఫ్యామిలీకోర్టులో దరఖాస్తు చేసుకున్న పేపర్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవడంతో.. వీరిద్దరూ విడాకులు పొందారన్న వార్త తెరపైకి వచ్చింది. వీరి విడాకుల విషయం తెలిసినప్పటి నుంచి నెటిజన్లు రెండు విషయాలు తెలుసుకునేందుకు తెగ వెతికేశారంట. ఆ రెండు విషయాలు ఏంటంటే.. వీరిద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు ? నిహారిక తరపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు ? ఈ విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించారు.
అయితే విడాకుల కోసం మొదట పిటిషన్ వేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆ తర్వాత నిహారిక తరపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. ఆయన నాగబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో నిహారిక విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. నిహారిక-చైతన్యల అంగీకారంతో కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు జూన్ 5న విడాకుల ఉత్తర్వులు జారీ చేసింది.




 



Tags:    

Similar News