బాలకృష్ణ భగవంత్ కేసరికి జాతీయ అవార్డు
2023 వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రానికి లభించింది
71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 2023 వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రానికి లభించింది. అన్ని భాషల చిత్రాలను పరిశీలించిన అనంతరం జాతీయ తెలుగు ఉత్తమచిత్రంగా భగవంత్ కేసరిని ఎంపిక చేసినట్లు జ్యూరీ తెలిపింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో హనుమాన్ చిత్రానికి లభించింది.
బలగం సినిమాకు...
ఉత్తమ గేయ రచయిత అవార్డును బలగం చిత్రానికి లభించింది. కాసర్ల శ్యామ్ రాసిన ఊరు.. పల్లెటూరు పాటకు ఈ అవార్డు లభించింది. తెలుగు సినిమా హనుమాన్ కు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా లభించింది. మొత్తం పదిహేను విభాగాల్లో ఈ అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది.