మ‌హేష్‌కు న‌మ్ర‌త స్పెష‌ల్ విషెష్

నేడు సూప‌ర్ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు. మ‌హేష్‌ 48 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు.

Update: 2023-08-09 08:17 GMT

నేడు సూప‌ర్ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు. మ‌హేష్‌ 48 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. దీంతో ఆయ‌న‌కు అభిమానులు, ప్ర‌ముఖుల‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. తన లైప్ పార్ట్‌న‌ర్‌ నమ్రత శిరోద్కర్ నుంచి మహేష్‌ ప్రత్యేక శుభాకాంక్షలు సైతం అందుకున్నాడు.


మహేశ్ బాబుతో కలసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన‌ నమ్రత..‘‘హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ఈ రోజు, ప్రతి రోజూ నీవే, నీవే’’ అంటూ శుభాకాంక్ష‌ల‌తో పాటు... త‌న ఇష్టాన్ని వ్య‌క్తం చేసింది. ఫోటోలో న‌మ్ర‌త మహేశ్ ను వెనుక నుంచి హత్తుకోవ‌డం చూడ‌వ‌చ్చు. నమ్రత పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది. అభిమానులు నైస్ క‌పుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 2005లో అతడు, 2010లో ఖలేజా సినిమాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం మహేశ్, తివ్రిక్రమ్ మూడో సినిమా చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌ రాజమౌళి త‌దుప‌రి చిత్రంలోనూ మహేశ్ నటించనున్నాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది.


Tags:    

Similar News