నాగార్జున 99.. 'నా సామిరంగ' సంక్రాంతికి మాస్ జాతర..

నాగార్జున పుట్టినరోజుకి ఏదొక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఫ్యాన్స్ ఆశించిన దానికంటే అదిరిపోయే అప్డేటే వచ్చింది.

Update: 2023-08-29 06:21 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) గత ఏడాది చివరిలో 'ఘోస్ట్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానులను నిరాశ పరిచింది. ఇక అప్పటి నుంచి నాగ్ సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చాడు. తన తదుపరి సినిమా అప్డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నా.. అటు నుంచి మాత్రం ఏ బదులు రాలేదు. నాగార్జున నుంచి సినిమా వచ్చి ఆల్మోస్ట్ ఏడాది అయ్యిపోయింది.

ఇక నేడు ఆగష్టు 29 నాగార్జున పుట్టినరోజు కావడంతో ఏదొక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఫ్యాన్స్ ఆశించిన దానికంటే అదిరిపోయే అప్డేటే వచ్చింది. నాగ్ తన 99వ చిత్రాన్ని అనౌన్స్ చేయడమే కాకుండా ఒక టైటిల్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశాడు. 'నా సామిరంగ' (Naa Saami Ranga) అనే మాస్ టైటిల్ ని పెట్టుకొని పక్కా రఫ్ రోల్ లో కనిపించబోతున్నాడు. లుంగీ, నోటిలో బీడీ, గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Full View

ధమాకా, దాస్ కా ధమ్కీ వంటి మాస్ సినిమాలకు కథని అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి స్టోరీ అందిస్తున్నాడు. ఇక తన కెరీర్ లో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాగార్జున.. ఇప్పుడు తన 99వ మూవీ 'విజయ్ బిన్నీ' అనే డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంకాంతి బరిలో మాస్ జాతర చేయడానికి నా సామిరంగ అంటూ నాగార్జున పోటీకి సిద్దమయ్యిపోయాడు. బంగార్రాజు, సొగడే చిన్నినాయనా వంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి.

ఇప్పుడు 'నా సామిరంగ' మూవీ కూడా అదే తరహాలో ఉండబోతుందని అర్ధమవుతుంది. దీంతో ఈసారి కూడా విజయం పక్కా అని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అక్కినేని కుటుంబం నుంచి ఒక్క హిట్టుగా లేదు. మరి నాగార్జున అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తాడా..? అనేది చూడాలి. కాగా 'నా సామిరంగ' సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.



Tags:    

Similar News