సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కు అస్వస్థత
సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ అస్వస్థత కు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ అస్వస్థత కు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఏఆర్ రెహమాన్ ఈరోజు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే రెహమాన్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్యం నిలకడగానే...
ఏ ఆర్ రహమాన్ కు చెన్నై అపోలో ఆసుపత్రి కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉందని, నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రయాణం చేయడం వల్ల కొంత అలసటకు గురై ఛాతీ నొప్పికి గురయ్యారని,ఆయనకు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని అపోలో వైద్యులు తెలిపారు.