Junior Ntr : జూనియర్ కోసం మరో కథ రెడీ.. బ్లాక్ బస్టర్ కు అడుగు దూరంలోనేనట

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ అంటే మినిమం హిట్ గ్యారంటీ.

Update: 2025-07-22 07:30 GMT

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ అంటే మినిమం హిట్ గ్యారంటీ. ఇది అందరూ అంగీకరించే విషయమే. ఎందుకంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ విడుదల అంటే అభిమానులకు పండగే. ఓపెనింగ్స్ లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇక లాభాలను లెక్కేసుకోవాల్సిందే నిర్మాతలు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇటు నిర్మాతలు, అటు దర్శకులు పోటీ పడుతుంటారు. ఎన్టీఆర్ సినిమా అగ్రిమెంట్ పై సంతకం చేస్తే చాలు తమకు కాసుల వర్షం కురిసినట్లేనని భావిస్తారు.

క్షణం తీరిక లేకుండా...
జూనియర్ ఎన్టీఆర్ అందుకే క్షణం తీరిక లేకుండా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా అందుతున్న అప్ డేట్ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు బాబీ ఒక కథను సిద్ధం చేసినట్లు టాక్ టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు వస్తున్న వార్తలు అభిమానుల్లో కూడా క్రేజ్ తెచ్చిపెట్టింది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాలు తీసి హిట్ కొట్టిన బాబి మరో హిట్ కోసం జూనియర్ ను ఎంచుకున్నాడన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఆరు నెలల నుంచి...
ఆరు నెలల నుంచి బాబీ కథను తయారు చేసే పనిలో ఉన్నారట. ఆ కథకు జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని నమ్మి ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినపడుతుంది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. బాబీ కధను విని ఓకే చెబుతాడా? లేదా? అన్నది కూడా అనుమానమేనని అంటున్నారుు. గతంలో వచ్చిన జైలవకుశ వీరిద్దరి కాంబినేషన్ లో హిట్ అందుకుంది. త్రిపాత్రాభినయంతో జూనియర్ తెరపై కనిపిచండంతో అభిమానులు మైమరిపించారు. మరి ఈ మూవీలో బాబీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అయి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News