Kingdom : కింగ్ డమ్ సీక్వెల్ లో నటించే ఆ స్టార్ హీరో ఎవరంటే?
ఏడేళ్ల నుంచి హిట్ లేని త హీరో విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ సినిమా చాలా వరకూ రిలీఫ్ నిచ్చింది.
ఏడేళ్ల నుంచి హిట్ లేని త హీరో విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ సినిమా చాలా వరకూ రిలీఫ్ నిచ్చింది. ఈ నెల 31వ తేదీన విడుదలయిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగానే అన్ని స్క్రీన్లపై సక్సెస్ ఫుల్లుగానే మూవీ ప్రదర్శిస్తున్నారు. దీంతో మేకర్స్ తో పాటు దర్శకుడు గౌతమ్ తిన్నసూరి, విజయ్ దేవరకొండలు సక్సెస్ మీట్ కూడా పెట్టారు.
అన్ని ప్రాంతాల్లో కలెక్షన్లలో...
అయితే కింగ్ డమ్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. విజయ్ దేవరకొండ ఈ మూవీలో మంచినటనతో అలరించడంతో పాటు క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయేలా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగా ఉండటంతో చాలా రోజుల తర్వాత మేకింగ్ అదిరిపోయేలా మూవీని తీసినట్లు మేకర్స్ చెబుతున్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా సీడెడ్ లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయని, అలాగే ఓవర్సీస్ లో కూడా కింగ్ డమ్ మూవీకి మంచి స్పందన కనిపిస్తుందని చెప్పారు.
ఎవరా స్టార్ హీరో...
అయితే మీడియా సమావేశంలో కింగ్ డమ్ సీక్వెల్ పై బిగ్ అప్ డేట్ ఇచ్చారు నిర్మాత. త్వరలోనే కింగ్ డమ్ 2 తీస్తామని, అయితే హీరో విజయ్ దేవరకొండ డేట్స్ ను బట్టి షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే కింగ్ డమ్ 2 సీక్వెల్ లో ఒక స్టార్ హీరో నటించనున్నారన్న లీకు కూడా ఇచ్చారు. ఎవరా స్టార్ మీరో అని చెప్పకపోయినప్పటికీ విజయ్ అభిమానులకు మాత్రం కింగ్ డమ్ మూవీ సీక్వెల్ చేస్తామని చెప్పడం కిక్కిచ్చే వార్త అని చెప్పాలి. అయితే సీక్వెల్ లో నటించే ఆ స్టార్ హీరో ఎవరన్న దానిపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.