యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ : "నేను విన్నాను.. నేను ఉన్నాను"
నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే..నమస్తే.. అంటూ మోషన్ పోస్టర్ ప్రారంభమవుతుంది. పాదయాత్ర సమయంలో..
yatra 2 motion poster
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా.. మహీ వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర తెరకెక్కింది. దానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించిన దర్శకుడు.. మళ్లీ 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యాత్ర 2 పై వరుస అప్డేట్లు ఇస్తున్నారు. ఇటీవలే టైటిల్ పోస్టర్ ను విడుదల చేయగా.. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. యాత్ర2 మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
1 నిమిషం 11 సెకన్ల నిడివితో ఉన్న ఈ మోషన్ పోస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేతి విగ్రహం సీన్ తో ప్రారంభమవుతుంది. నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే..నమస్తే.. అంటూ మోషన్ పోస్టర్ ప్రారంభమవుతుంది. పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన "నేను విన్నాను.. నేను ఉన్నాను" అనే డైలాగ్ తో వీడయో ముగుస్తుంది. ఈ మోషన్ పోస్టర్ లో వైఎస్సార్, జగన్ చెప్పిన డైలాగ్ లే ప్రేక్షకులను ప్రధానంగా ఆకట్టుకుంటాయి. జగన్ పాదయాత్ర, వైసీపీ ఆవిర్భావం, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తదితర అంశాల ఆధారంగా డైరెక్టర్ మహీ వి రాఘవ్ యాత్ర 2 ను తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ సినిమాలో జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారని సమాచారం. దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మోషన్ పోస్టర్ లోనూ జగన్ క్యారెక్టర్ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.