Sagar : జనసేనలోకి ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు.. తెలంగాణ ఎలక్షన్స్‌లో..!

'మొగలి రేకులు' సీరియల్ లో 'ఆర్కే నాయుడు' అలియాస్ సాగర్ జనసేనలో జాయిన్ అయ్యాడు.

Update: 2023-11-07 06:03 GMT

Sagar : టాలీవుడ్ సీరియల్ యాక్టర్ 'సాగర్' అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ 'మొగలి రేకులు' సీరియల్ లో 'ఆర్కే నాయుడు' అంటే చాలా తేలిగ్గా గుర్తు పట్టేస్తారు. ఆ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు.. హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఈ నటుడు సినీ రంగం నుంచి రాజకీయ రంగం పై అడుగులు వేస్తున్నాడు.

తెలంగాణ గోదావరిఖని రామగుండం నియోజకవర్గానికి చెందిన సాగర్.. ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాగర్, పవన్ కళ్యాణ్ తో కొంతసేపు భేటీ అయిన ఫోటోలు బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. ఆ సమయంలో సాగర్ జనసేన పార్టీలో చేరబోతున్నాడా? అనే సందేహాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఈ నటుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో జాయిన్ అయ్యాడు.
కాగా ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్ లో జనసేన కొన్ని పరిమితి ప్రాంతాలకు పోటీ చూస్తున్నట్లు పవన్ ఇప్పటికే తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధాలను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సమయంలో సాగర్ జనసేన కండువా కప్పుకోవడం చర్చినీయాంశంగా మారింది. సొంత నియోజకవర్గం రామగుండం నుంచి సాగర్ పోటీ చేయబోతున్నాడా అనే సందేహం మొదలైంది.

మరి దీని మీద క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో మంచి ఫేమ్‌ని అందుకున్న సాగర్.. ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీలో ఒక చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘సిద్దార్థ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత రెండు సినిమాల్లో నటించాడు. చివరిగా 2021లో దిల్ రాజు నిర్మాణంలో ‘షాదీ ముబారక్’ అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు.


Tags:    

Similar News