Chiranjeevi : చిరంజీవి + అనిల్ రావిపూడి మూవీ టైటిల్ రివీల్.. అదిరిపోలా?

మెగాస్టార్ చిరంజీవికి డెబ్భయో ఏట ఈరోజు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమా టైటిల్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశారు

Update: 2025-08-22 07:26 GMT

మెగాస్టార్ చిరంజీవికి డెబ్భయో ఏట ఈరోజు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమా టైటిల్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశారు. మెగా 157 సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా దర్శకుడు ఫ్యాన్స్ కు తీపికబురు అందించారు. ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారూ... అని టైటిల్ పెట్టారు. ట్యాగ్ లైన్ మాత్రం పండగకి వస్తున్నారు అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచానాలు తొలి నుంచి వినిపిస్తున్నాయి.

వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో...
కామెడీ, యాక్షన్, డ్రామాతో రూపొందుతున్న ఈ సినిమా ఒకటో షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కు షూటింగ్ చేరింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈరోజు విడుదలయిన గ్లింప్స్ లో ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో వెంకటేశ్ నటించడం ఖాయమని తేలిపోయింది. చిరంజీవి, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడనుండటంతో ఇక ప్రేక్షకులకు నిజమైన పండగేనని చెప్పాలి.
స్టయిలిష్ గా కనపడుతూ...
ఈ మూవీకి భారీగా బజ్ ఏర్పడటంతో అంచనాలు అందుకునేలా చిత్రీకరించడానికి అనిల్ రావిపూడి కసరత్తులు చేశారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారను ఒక హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం ముహూర్తపు క్లాప్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి మూవీపై హైప్ క్రియేట్ చేస్తూ వెళుతున్నారు. చిరంజీవి 157 చిత్రం బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమని ముందుగానే చెబుతున్నారు. అదే స్థాయిలో చిత్రీకరణ కూడా జరుగుతుంది. తాజాగా విడుదలయిన గ్లింప్స్ లో చిరంజీవి చాలా స్టయిలిష్ గా కనిపించడమే కాకుండా.. న్యూ లుక్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతి పండగేనంటున్నారు.


Tags:    

Similar News