సూపర్ స్టార్ కు మెగాస్టార్ వీరాభిమాని

సూపర్ స్టార్ కృష్ణకు అభిమాని మెగాస్టార్ చిరంజీవి. ఆయన కృష్ణ సినిమాలు చూసి ప్రేరణ పొంది చిత్ర రంగంలోకి ప్రవేశించారు

Update: 2022-11-15 04:18 GMT

సూపర్ స్టార్ కృష్ణకు అభిమాని మెగాస్టార్ చిరంజీవి. ఆయన కృష్ణ సినిమాలు చూసి ప్రేరణ పొంది చిత్ర రంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాను కృష్ణ సినిమాలు చూసి మద్రాస్ రైలు ఎక్కానని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకున్నారు. కృష్ణ మృతిని తాను నమ్మలేకపోతున్నానని చిరంజీవి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

అధ్యక్షుడిగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణకు 2,500 అభిమాన సంఘాలున్నాయి. మిగిలిన ఏ హీరోలకు ఈ స్థాయిలో అభిమాన సంఘాలు అప్పట్లో లేవు. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఉన్న అభిమాన సంఘానికి చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నారు. తోడు దొంగలు సినిమా విడుదలయిన సందర్భంలో చిరంజీవి విడుదల చేసిన కరపత్రం నేడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృష్ణను స్ఫూర్తిగా తీసుకుని చిత్రరంగంలోకి చిరంజీవి వచ్చారంటారు.


Tags:    

Similar News