బాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. గాడ్ ఫాదర్ మొదటి రోజు వసూళ్లు ఎంతంటే..?

ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ చిత్రం రూ.90 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లుగా

Update: 2022-10-06 07:11 GMT

చిరంజీవి కథానాయకుడిగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్' విడుదలైంది. ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజునే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను సాధించాయి. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కేవలం కంటెంట్ పై ఆసక్తితోనే థియేటర్స్ కి వచ్చారు. అద్భుతమైన ఫస్ట్ హాఫ్ ఉండడం.. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో సినిమా హిట్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 20 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం. గాడ్ ఫాదర్ సినిమాలో మురళీ శర్మ, సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, బ్రహ్మాజీ, దివి కీలక పాత్రలలో కనిపించారు. నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించారు. అలాగే సల్మాన్ ఖాన్ ఒక అతిధి పాత్రలో కనిపించడమే కాక స్పెషల్ సాంగ్ లో కూడా మెరిశారు. పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపించారు.

గాడ్ ఫాదర్ బిజినెస్
ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ చిత్రం రూ.90 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే తక్కువే అని చిత్ర వర్గాలు అంటున్నాయి.
నైజాం – 22 కోట్లు
సీడెడ్ – 13.50 కోట్లు
ఆంధ్ర – 35 కోట్లు
ఏపీ+తెలంగాణ – 70.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.
కర్ణాటక – 6.50 కోట్లు
హిందీ – 6.50 కోట్లు
ఓవర్సీస్ – 7.50 కోట్లు


Tags:    

Similar News