Viswambhara : విశ్వంభర పై "మెగా" అప్ డేట్

విశ్వంభర మూవీపై మెగాస్టార్ చిరంజీవి మెగా అప్ డేట్ ఇచ్చేశారు.

Update: 2025-08-21 04:16 GMT

విశ్వంభర మూవీపై మెగాస్టార్ చిరంజీవి మెగా అప్ డేట్ ఇచ్చేశారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి విశ్వంభర మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈరోజు సాయంత్రం 6.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. రేపు చిరంజీవి బర్త్ డే కావడంతో నేడు టీజర్ ను విడుదలచేయనున్నారు.

చందమామ కథలా...
అంతేకాదు విశ్వంభర మూవీ ఆలస్యానికి గల కారణాలను కూడా చిరంజీవి ట్వీట్ లో వివరించారు. వీఎఫ్ఎక్స్ ల వల్లనే సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు. విశ్వంభర మూవీ ఒక చందమామ కథకలా సాగిపోతుందని, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తుందని ఆయన తెలిపారు. అద్భుతమైన విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులకు ముందుకు వస్తుందని, అందుకోసమే మంచి క్వాలిటీతో ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడానికి ఆలస్యమయిందని ఆయన ట్వీట్ చేశారు.


Tags:    

Similar News