"మెగా" సీక్వెల్ కు బీజం.. వచ్చే ఏడాది ప్రారంభం కానుందా?
మెగా అభిమానులకు మరో తీపి కబురు అందినట్లే, మెగా సీక్కెల్ కు బీజం పడినట్లేనని అంటున్నారు
మెగా అభిమానులకు మరో తీపి కబురు అందినట్లే. చిరంజీవి చెప్పినట్లే చెప్పినా.. అది కార్యరూపం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్నది టాలీ వుడ్ టాక్. అంతా బాగుంటే వచ్చే ఏడాది ఈ గుడ్ న్యూస్ మెగా అభిమానులకు అందే అవకాశాలున్నాయని అంటున్నారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు - అతిలోక సుందరి మూవీకి ముప్ఫయి ఐదేళ్లు పూర్తయింది. అయితే ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుందని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. అది అభిప్రాయం కాదని.. ఖచ్చితంగా ఆచరణలోకి వస్తుందని అంటున్నారు.
అనేక అప్ డేట్స్ వస్తున్నా...
అందుకే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. దీంతో పాటు చిరంజీవి ఈవెంట్ లో అందులో నటించే వారి పేర్లు, దర్శకుడు కూడా వీరయితే బాగుంటుందని సూచించడంతో ఆ మూవీ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లేనని అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా నిర్మించాలన్నది చిరంజీవి అభిప్రాయం. అలాగే ఈ మూవీకి నిర్మాతలుగా అశ్వినీదత్ కుమార్తెలు వ్యవహరించాలని కోరుకున్నారు. దర్శకుడిగా దత్తు అల్లుడు నాగ్ అశ్విన్ ఉండాలన్నారు.
కథ రెడీ చేసే పనిలో...
కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఫిక్స్ అయినట్లు టాక్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి అలవోకగా చెప్పలేదని, ఉంగరం పోయిందని చెప్పి ముగించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ను అక్కడి నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన కథను రెడీ చేయాలని ఇప్పటికే నాగ్ అశ్విన్ కు కూడా చెప్పారని టాక్. అదే సమయంలో రాఘవేంద్రర రావు సహకారం తీసుకుని ఈ సీక్వెల్ ను బ్లాక్ బస్టర్ చేయాలని భావిస్తున్నారు. మహానటి, కల్కి వంటి చిత్రాలతో బాక్సాఫీసును దడదడ లాడించిన నాగ్ అశ్విన్ ఈ కథను తయారు చేసుకునే పనిలో ఉన్నారని పరిశ్రమ వర్గాల టాక్. అందుకే చేప మింగిన ఉంగరం నుంచి కథ మొదలవుతుందని అంటున్నారు. నిజంగా ఇది మెగా న్యూస్ అని చెప్పాలి. అయితే నాగ్ అశ్విన్, రామ్ చరణ్ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే ఈ మూవీ గురించి రివీల్ చేసే అవకాశముందని చెబుతున్నారు.