Chiranjeevi : మరో సూపర్ గిఫ్ట్ రెడీ.. మెగా ఫ్యాన్స్ రెడీ అయిపోండి
మెగా అభిమానులకు మరో సూపర్ గిఫ్ట్ అందబోతుంది. డబుల్ ధమాకా దక్కబోతుంది. ఈ నెలలో చిరంజీవి నటించి విశ్వంభర మూవీకి సంబంధించిన టీజర్ విడుదలవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
మెగా అభిమానులకు మరో సూపర్ గిఫ్ట్ అందబోతుంది. డబుల్ ధమాకా దక్కబోతుంది. ఈ నెలలో విశ్వంభర మూవీకి సంబంధించిన టీజర్ విడుదలవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించే సినిమాకు సంబంధించి అప్ డేట్ కూడా ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేస్తారంటున్నారు. ఇందుకు సంబంధించిన మేకర్స్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కు టీజర్ ను విడుదల చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి మరో ఆరు రోజుల్లో విశ్వంభరకు సంబంధించిన మరో టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
విశ్వంభర మూవీపై...
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. సోషియో, ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ కావడంతో చిరు ఖచ్చితంగా ఈ మూవీతో హిట్ కొట్టేస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. అలాగే బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడంటున్నారు. అయితే విశ్వంభర మూవీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నప్పటికీ ఏదో ఒక కారణంతో ఆ మూవీ వాయిదా పడుతూనే వస్తుంది. గేమ్ ఛేంజర్ విడుదల కారణంగా వాయిదా పడిన మూవీ ఇంత వరకూ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఖరారు చేయలేకపోతున్నారు.
అనిల్ రావిపూడి కూడా...
వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో మేకర్స్ వాయిదా వేసుకుంటూ వెళుతున్నారు. అభిమానుల ఓపికను పరీక్షిస్తున్నారు. మొదటి టీజర్ లోనే గ్రాఫిక్స్ కు సంబంధించి కొన్ని లోపాలు కనిపించడంతో ఇక తర్వాత దర్శకుడు వశిష్ట గ్రాఫిక్స్ ఉన్న లోపాలను సవరించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పై కూడా క్రేజీ అప్డ డేట్ చిరంజీవి బదర్త్ డే రోజును విడుదలవుతుందని అంటున్నారు. అంటే మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పాలి.