'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ లాక్‌

. 'వాల్తేరు వీరయ్య'తో సూపర్‌ హిట్‌ కొట్టారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు అదే ఊపుతో 'భోళా శంకర్‌' సినిమా చేస్తున్నారు.

Update: 2023-07-23 11:47 GMT

'ఆచార్య' పెద్దగా ఆడకపోయినా.. 'వాల్తేరు వీరయ్య'తో సూపర్‌ హిట్‌ కొట్టారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు అదే ఊపుతో 'భోళా శంకర్‌' సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన 'వేదాళం' సినిమాకు ఈ మూవీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ చిరంజీవి అభిమాని కావడంతో.. ఈ సినిమాలో స్టఫ్‌ మాములుగా ఉండదని అభిమానులు ధీమాతో ఉన్నారు. మరో మూడు వారాల్లో 'భోళా శంకర్‌' సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలోనే పొస్ట్‌ ప్రొడక్షన్‌, ప్యాచ్‌ వర్క్‌ చకచకా జరుగుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో.. మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. జూలై 27న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

చేతిలో కత్తి పట్టుకుని మాస్‌ అవతారంలో ఉన్న చిరంజీవి లుక్‌ అదిరిపోయింది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లతో కంపేర్‌ చేసి చూస్తే.. ఈ లుక్‌ మాత్రం వేరే లెవల్లో ఉంది. త్వరలోనే మేకర్స్‌ ప్రమోషన్‌లు కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కుతోంది. సిస్టర్‌ సెంటిమెంట్‌ మెయిన్‌గా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో సుశాంత్‌ కీ రోల్‌లో కనిపించనున్నాడు. డే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి టాక్సీ డ్రైవర్ కనిపిస్తారని టాక్. ఈ మూవీలో తులసి, రఘు బాబు, రావు రమేష్​, ఉత్తేజ్​, వెన్నెల కిశోర్​, మురళీ శర్మ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. 

Tags:    

Similar News