లెజెండరీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం దాదాపు 37 సంవత్సరాల తర్వాత 'థగ్ లైఫ్' అనే యాక్షన్ చిత్రం కోసం తిరిగి కలిశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని సొంతం చేసుకుంది. థగ్ లైఫ్ సినిమా విషయంలో మణిరత్నం అభిమానులకు క్షమాపణలు చెబుతున్నారు.
“మా ఇద్దరి నుండి మరో నాయకన్‌ను ఆశించిన వారికి, నేను చెప్పగలిగేది ఏమిటంటే, మమ్మల్ని క్షమించండి. అతిగా అంచనా వేయడం కంటే, ఇది భిన్నమైన అంచనాలతో వచ్చిన సినిమా అని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు మేము అందించిన దానికి చాలా భిన్నంగా ఉండేదాన్ని ఆశించారు.” అని తెలిపారు. థగ్ లైఫ్ చిత్రం అభిమానులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచింది, ఇది కమల్-మణి కాంబో నుండి ఎవరూ ఆశించే సినిమా కాదని పలువురు పెదవి విరిచారు.