సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో చోరీకి యత్నం

ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడంతో.. కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ వ్యక్తి గాయాలతో

Update: 2022-09-29 06:18 GMT

Man Try to Theft in Mahesh babu's house 

టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంటికి ఓ దొంగ కన్నం వేసేందుకు యత్నించాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు. 30 అడుగుల ఎత్తైన గోడ ఎక్కి కిందికి దూకాడు. కానీ ఆ గోడ ఎత్తుగా ఉండటంతో దొంగ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడంతో.. కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ వ్యక్తి గాయాలతో పడి ఉండడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు తెలుసుకున్నారు. తీవ్రగాయాలపాలైన అతను ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Tags:    

Similar News