చిరంజీవిది కాదట.. రేపు వచ్చే సర్ ప్రైజ్ మన శంకర వరప్రసాద్ లో అదేనటగా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మన శంకర వరప్రసాద్ కు సంబంధించిన సర్ ప్రైజ్ రేపు రానుంది
మెగాస్టార్ చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మన శంకర వరప్రసాద్ కు సంబంధించిన సర్ ప్రైజ్ రేపు రానుంది. దసరాకు మరో సర్ ప్రైజ్ ఇస్తానని ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన నేపథ్యంలో రేపు ఏం సర్ ప్రైజ్ రానుందా? అన్న దానిపై మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి పుట్టిన రోజు విడుదల చేసిన గ్లింప్స్ ఒకరేంజ్ లో ఉండటంతో మరింత హైప్ పెరిగింది.
ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ...
అనిల్ రావిపూడి తన సినిమాలకు సంబంధించి రిలీజ్ కు ముందే ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంటారు. ముందునుంచే ప్రమోషన్స్ చేస్తూ ఆ చిత్రానికి భారీగా హైప్ తెస్తుంటారు. అందులో భాగంగా మన శంకరవరప్రసాద్ సినిమాలో నయనతార పాత్ర ఏంటో కూడా అనిల్ రావిపూడి రివీల్ చేశారు. ఈ మూవీలోశశిరేఖ పాత్రలో కనిపిస్తుందని అనిల్ రావిపూడి రివీల్ చేశారు. ఈ కీలక అప్ డేట్ తో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. శంకరవరప్రసాద్ సరసన శశిరేఖగా నయనతార నటిస్తుందని తెలిసిన ఫ్యాన్స్ దసరా పండగను ముందే చేసుకుంటున్నారు.
రేపు మరో కీలక అప్ డేట్...
రేపు మరో కీలక అప్ డేట్ ను అనిల్ రావి పూడి మన శంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి విడుదల చేస్తామని ప్రకటించారు. కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణలో యూనిట్ ఉంది. వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి పండగకు ఈ సినిమా విడుదల చేయడానికి అనిల్ రావిపూడి వేగంగా షూటింగ్ చేస్తున్నారు. మెగా అభిమానులకు సంక్రాంతి ట్రీట్ మామూలుగా ఉండదని, కోడి పందేలు, జల్లికట్టుకు మించిన ఎనర్జీతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ కూడా ఉండటంతో కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు వెంకటేశ్ పాత్రను రివీల్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.