Raja Saab : రాజా సాబ్.. కోసం ఎదురు చూస్తున్నారా.. ఇదిగో తీపి కబురు

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ పై మేకర్స్ లేటెస్ట్ అప్ డేట్ విడుదల చేశారు

Update: 2025-10-06 06:21 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ పై మేకర్స్ లేటెస్ట్ అప్ డేట్ విడుదల చేశారు. ఇప్పటికే రాజాసాబ్ కు సంబంధించి విడుదలయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒకరేంజ్ లోకి తీసుకు వెళుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి చేతిలో ప్రభాస్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ఇందులో ముగ్గురు హీరోయిన్ల మధ్య డార్లింగ్ చేసే సందడి అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నారు. ప్రభాస్ నటించిన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

సంక్రాంతికి విడుదలకు....
ది రాజాసాబ్ సంక్రాంతికి విడుదలవుతుందని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తుంది. రొమాంటిక్ మరియు హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా మూవీని నిర్మిస్తుండటంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ లో అన్ని రకాల వేరియేషన్లు చూసేందుకు వీలవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అందుకోసమే ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ ను కూడా వదల కుండా సోషల్ మీడియాలో మేకర్స్ పోస్టులు పెడుతున్నారు.
యూరప్ పర్యటనకు...
తాజాగా అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు కథానాయికలుగా కనిపించనున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందుకోసం ది రాజా సాబ్ ఈ వారంలో షూటింగ్ చేయడానికి యూరప్ లో చేయడానికి బయలుదేరి వెళ్లింది. అక్కడ రెండు పాటల చిత్రీకణణ పూర్తి చేసుకోనుందని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదలయ్యే ది రాజాసాబ్ మూవీ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనుందని తెలిసింది.
Tags:    

Similar News