Guntur Kaaram : గుంటూరు కారం రచయితలపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం..

గుంటూరు కారంకి సంబంధించిన కొన్ని విషయాలు ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరుత్సాహ పరుస్తున్నాయి. మహేష్ లాంటి స్టార్‌తో సినిమా..

Update: 2023-12-29 11:25 GMT

 Kurchi Madathapetti Song

Guntur Kaaram : మహేష్ బాబు మరోసారి త్రివిక్రమ్ మీద నమ్మకం పెట్టి చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా.. ఆడియన్స్ ని ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఈసారైనా ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్టు అందుకుంటుందని అభిమానులు ఆశిస్తుంటే.. సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు వారిని తీవ్రంగా నిరుత్సాహ పరుస్తున్నాయి. ఇలా అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్న విషయాల్లో.. సంగీతం, సాహిత్యం కూడా ఉన్నాయి.
ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్ చేశారు. ధమ్ బిర్యానీ, ఓ మై బేబీ.. సాంగ్స్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా మూడో పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అయితే పూర్తిగా ఒక యూట్యూబ్ డీజే సాంగ్ ని నుంచి కాపీ కొట్టేసారు. మహేష్ బాబు స్టాండర్డ్ కి తగ్గట్టు అయితే పాటలు ఉండడం లేదు. అసలు మహేష్ బాబు కాకుంటే ఆ పాటలకు ఆ మాత్రం రీచ్ కూడా వచ్చేది కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక అలాగే ఫ్యాన్స్ కి విసుగు తెప్పిస్తున్న మరో విషయం.. పాటలోని సాహిత్యం. ట్రెండ్ కి తగ్గట్టు లిరిక్స్ అంటూ ఏవేవో రాస్తున్నారు. మాస్ ని అట్ట్రాక్ట్ చేయడానికి ఏవేవో పదాలు పెడుతున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో పాటలు అంటే.. ఆడియన్స్ పై ప్రభావం చూపేలా ఉంటాయి. అలాంటి హీరో పాటలకు లిరిక్స్ రాసేటప్పుడు.. కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన మూడో పాటలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'కుర్చీ మడతపెట్టి' అనే అర్థంలేని పదం ఉపయోగించడం పై కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన మూడు పాటలకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

Tags:    

Similar News