Peddi : టాలీవుడ్ ను షేక్ చేస్తున్న పెద్ది మూవీ.. డిజిటల్ రైట్స్ పై వార్తలు నిజమయితే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ కి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చేసింది

Update: 2025-06-17 06:28 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ కి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో అందరి చూపూ పెద్ది మూవీ వైపు నిలిచాయి. రామచరణ్ నటనకు బుచ్చిబాబు దర్శకత్వంతో మరింతగా హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది. క్రికెట్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాను గ్రామీణ ప్రాంతం కథతో ముడిపెట్టి స్క్రీన్ మీదకు తెస్తున్నారు.

షూటంగ్ పూర్తి కాకముందే...
ఈసినిమాలో జాన్వికపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ నటిస్తుండటం కూడా మరింతగా అంచనాలు పెరిగాయి. పెద్ది సినిమా కు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అది అభిమానులకు పండగే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమా కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు. నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిపించేలా ఉంది. పెద్ది మూవీకి సంబంధించి తాజాగా డిజిటల్ హక్కులపై ఒక వార్త వైరల్ అయింది. ఈ మూవీ షూటింగ్ పూర్తికాకముందే పెద్ది డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందంటున్నారు.
నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ను...
నెట్ ఫ్లిక్స్ 105 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందన్న వార్తలు టాలీవుడ్ ను షేక్ చేశాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ టాలీవుడ్ టాక్ మాత్రం నడుస్తుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ కుదిరిన అగ్రిమెంట్లలో ఇదే అతి పెద్దది అని చెబుతున్నారు. ఇక డిజిటల్ రైట్స్ తోనే వంద కోట్లు దాటేస్తే ఈ మూవీ రామ్ చరణ్ బర్త్ డే వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన విడదలయితే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందన్నది చూడాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News