Kalki 2 Movie : కల్కి మూవీపై హింట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే
కల్కి2 మూవీపై తాజాగా అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన, నాగ్ అశ్విన్ దర్శకత్వంలోమూవీ కల్కి గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది
కల్కి2 మూవీపై తాజాగా అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన, నాగ్ అశ్విన్ దర్శకత్వంలోమూవీ కల్కి గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ కల్కి మూవీకి సీక్వెల్ ఉంటుందని నాడే దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కు గుర్తింపు తెచ్చిన కల్కి 2 లో కూడా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై నాగ్అశ్విన్ ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ హింట్ ఇచ్చాడు.
త్వరలోనే షూటింగ్ ....
కల్కి 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. అయితే ఈ మూవీలో నటించే వారందరూ ఏదో ఒక మూవీలో షూటింగ్ లో ఉన్నందున వారందరికీ వీలు చిక్కినప్పుడు, డేట్స్ అందరివీ కుదరినప్పుడు మాత్రమే కల్కి 2 షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. యాక్షన్ సన్నివేశాలు చాలా చిత్రీకరించాల్సి ఉండటంతో చాలా సమయం పట్టే అవకాశముందని నాగ్ అశ్విన్ వివరించారు. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా ఎక్కువ సమయం పడుతుందని ఆయన తెలిపారు. మరో రెండేళ్లలో కల్కి 2 మూవీ విడుదలవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని నాగ్ అశ్విన్ పాడ్ కాస్ట్ లో వివరించారు.
ముగ్గురు అగ్రనటులతో...
కల్కి 2 భాగంలో కమల్ హాసన్ ఉంటారని గతంలోనే నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. అంటే ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు ముగ్గురితో మూవీ తీయాల్సి ఉంటుంది. అందుకు అందరి డేట్స్ దొరకాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ చాలా బిజీగా ఉండటంతో మిగిలిన ఇద్దరి డేట్స్ ప్రభాస్ ఇచ్చేసమయానికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు అగ్రనటులు, పాన్ ఇండియా స్టార్లు నటించే ఈ మూవీపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ చాలా సినిమాలతో బిజీగా ఉండటంతో అవి పూర్తయిన తర్వాత కల్కి 2 మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాలి. అందుకోసం డార్లింగ్ ఫ్యాన్స్ మరో అప్ డేట్ కోసం ఎదురు చూడక తప్పదు.