రిషబ్ శెట్టి మాయలో పడిపోయా : కేఎల్ రాహుల్

రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్‌ 1 దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

Update: 2025-10-08 05:47 GMT

రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్‌ 1 దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కథ, చిత్రీకరణ, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాపై భారత క్రికెటర్‌ కే.ఎల్‌.రాహుల్‌ స్పందించారు. తాను కాంతారా చూశానని, మళ్లీ రిషబ్‌ శెట్టి మాయలో పడిపోయానని, మంగళూరు ప్రజల విశ్వాసాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపించిందని కేఎల్ రాహుల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దానిపై నమస్కార, హార్ట్‌ ఎమోజీలను కూడా జత చేశాడు.

గతంలోనూ మైదానంలో...
తర్వాత రిషబ్‌ శెట్టి ఆ పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ, రెండు హార్ట్‌ ఎమోజీలతో రాహుల్‌ అభినందనకు స్పందించాడు. కాంతారాపై రాహుల్‌ అభిమానమంతా ఇంతటితో ఆగలేదు. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయానికి నడిపిన తర్వాత, తన ప్రత్యేక సంబరంతో ఆకట్టుకున్నాడు. హెల్మెట్‌ తీసి, బ్యాట్‌ను నేలపై కొట్టి, తన చుట్టూ గీత వేసి, గుండెపై చెయ్యి పెట్టి నేల చూపుతూ “ఇది నా భూమి” అని సంకేతం ఇచ్చినట్లు ఆ సెలబ్రేషన్‌ను నిర్వహించాడు. అభిమానులు వెంటనే దానిని కాంతారాలో రిషబ్‌ శెట్టి చేసిన ప్రసిద్ధ సన్నివేశంతో పోల్చారు. సినిమా ప్రభావం ప్రేక్షకులకే కాకుండా క్రీడాకారులపై కూడా చూపుతోందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.


Tags:    

Similar News