కాంతారా సినిమా ప్రభావం.. వారందరికీ నెల నెలా 2000 రూపాయలు

Update: 2022-10-21 02:24 GMT

కలెక్షన్ల వర్షం కురిపించాలంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం లేదని నిరూపించిన సినిమా 'కాంతారా'. హిట్ టాక్ తో ఈ సినిమా భాషలతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ఉంది. ముఖ్యంగా 'భూతకోలా' అంటే ఏమిటో ఈ కాలం ప్రజలకు తెలియజేసింది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని, భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం విషయం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన వారికి నెలకు రూ.2000 చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. "Adoring Daivas, dance, and divine intervention. The BJP-led #Karnataka government has announced a Rs 2,000 monthly allowance for 'Daiva Narthakas' above 60 years of age. Bhoota Kola, a spirit worship ritual depicted in the movie #Kantara is part of Hindu Dharma. @shetty_rishab" అంటూ పోస్టు పెట్టారు.

టాలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది. 6 రోజుల్లో ఈ సినిమా హిందీలో రూ.13 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. IMDb రేటింగ్స్ లో టాప్ 250 చిత్రాల జాబితాలో ఈ చిత్రం నంబర్ 1 స్థానానికి చేరుకుంది. కంబాల సాంప్రదాయ సంస్కృతిని, భూత కోలా కళారూపాన్ని హైలైట్ చేశారు. సినిమా కథ దక్షిణ కన్నడలోని కాల్పనిక గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. క్రాఫ్ట్, కల్చర్, టెక్నికల్ బ్రిలియన్స్ గా ఈ సినిమా గురించి చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ప్రశంసిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News