కాంతార షూటింగ్.. పడవ ప్రమాదంపై క్లారిటీ

రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’ ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది.

Update: 2025-06-16 10:15 GMT

రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’ ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందని 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందంటూ వచ్చిన వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఆదర్శ్‌ స్పందించారు.


ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము ఒక సెట్‌ వేశామని గాలి వల్ల అది దెబ్బతిందని అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్‌లో ఎవరూ లేరన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్‌ సమక్షంలో షూట్‌ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News