Kantara : కలెక్షన్లతో దూసుకుపోతున్న కాంతారా.. ఇప్పటికి వసూలు ఎంతంటే?
కాంతారా చాప్టర్ 1 మూవీ కలెక్షన్లతో దూసుకుపోతుంది
కాంతారా చాప్టర్ 1 మూవీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ నెల 2వ తేదీన విడుదలయిన కాంతారా మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన నటించిన కాంతారా చాప్టర్ 1 బిగ్గెస్ట్ హిట్ అయింది. పాన్ ఇండియా మూవీగా విడుదలయింది. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో అన్ని రికార్డులను అధిగమించింది. కొత్త రికార్డులను సృష్టిస్తుంది.
విడుదలయిన అన్ని భాషల్లో...
తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషల్లో విడుదలయిన ఈ చిత్రం ఇప్పటికే 800 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మరింతగా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలుచెబుతున్నాయి. ఇప్పటి వరకూ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంకా వసూళ్ల పరంగా దూసుకెళ్లే అవకాశముంది.