దుమ్ము రేపుతున్న కాంతార చాప్టర్ 1

కాంతార చాప్టర్ 1 విడుదలయి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.

Update: 2025-10-02 06:31 GMT

కాంతార చాప్టర్ 1 విడుదలయి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. కాంతార తో రిషబ్‌ శెట్టికి జాతీయ స్థాయి ప్రశంసలు అందుతున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న కాంతారతో భారత సినిమా సరిహద్దులను దాటించిన నటుడు–దర్శకుడు రిషబ్‌ శెట్టి, మరోసారి ప్రేక్షకులను తన మంత్ర ముగ్ధులను చేశారు. కాంతార చాప్టర్‌ 1 విడుదలై థియేటర్లలో హంగామా చేస్తుంది. .

ప్రేక్షకుల జేజేలు...
ఈ చిత్రంలో రిషబ్‌ శెట్టి మరోసారి సంస్కృతి, భక్తి, యాక్షన్‌ను సింగిల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. తెరపై ఆయన చూపిన సాహసాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాంతార చాప్టర్ 1లో దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేక్షకులు ఆయనను మరోసారి కొత్త కథనంతో ముందుకు వచ్చారని కొనియాడుతున్నారు. కథ చెప్పే శైలిలో రిషబ్‌ శెట్టి ఎప్పటికప్పుడు కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నారని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Tags:    

Similar News