ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తారక్.. త్వరలో బేటీ ఎప్పుడంటే?
తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు
తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తనను కలసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని తారక్ తెలిపారు. తనను కలవడం కోసం అభిమానులు వేచి చూస్తున్నారని, అయితే తాను కూడా వారిని కూడా అదే ఆనందంలో కలుసుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
ఎప్పుడంటే...
అయితే వేదిక ఎక్కడ? తేదీ ఎప్పుడు? అనేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు పొంది, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అప్పటి వరకూ సహనంతో తన ఫ్యాన్స్ ఉండాలని జూనియర్ కోరారు. తనను కలిసేందుకు ఇప్పుడు ఎవరూ రావద్దని, త్వరలో తానే అందరినీ కలుస్తానని ఆయన తెలిపారు