Tollywood : పదిహారో రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె
తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయి నేటికి పదహారు రోజులు కావస్తుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయి నేటికి పదహారు రోజులు కావస్తుంది. నిర్మాతలకు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మె కొనసాగుతుంది. అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయిన తర్వాత కార్మిక సంఘాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించే చర్చలకు తాము వెళతామని చెప్పారు.
నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు...
ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా తమకు పిలుపు వచ్చిందని, నేడు ఛాంబర్ తో కూడా సమావేశమవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు.చర్చలకు పిలిచారు కాబట్టి తాము నిరసనలు నిలిపివేశామని ఆయన చెప్పారు. అన్నియూనియన్లకు సంబంధించిన కార్మికులన వేతనాలు పెంచుతారని భావిస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్పారు.