పుష్ప-2 లో విజయ్ సేతుపతి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..!

ఈ సినిమాలో రానా దగ్గుబాటిని తీసుకోవాలని అనుకున్నారు కానీ.. షెడ్యూల్ సమస్యల కారణంగా మేకర్స్ విజయ్ సేతుపతిని

Update: 2022-08-15 09:30 GMT

పుష్ప సినిమా భారీ విజయం సాధించాక.. రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో రూపొందించాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే పుష్ప-2 లో భారీ తారాగణాన్ని దించాలని అనుకుంటున్నారని.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తూ వచ్చాయి. పుష్ప-2 లో దక్షిణాదిలోనే బిజీ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి కూడా భాగమయ్యాడనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ సేతుపతి పీఆర్‌వో ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. '' షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో మాత్రమే ఆయన నటిస్తున్నారని.. మరే సినిమాలో ఆయన నటించడంలేదని'' తెలిపాడు. విజయ్ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్‌గా మారింది.

హిందీ చిత్రాల వరుస పరాజయాల మధ్య, ఇప్పుడు బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ మాత్రమే హిట్ అందించగలడని భావిస్తూ ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమను ఫ్లాప్‌ల నుండి షారుఖ్ ఖాన్ మాత్రమే కాపాడగలడని అంటున్నారు. స్పై థ్రిల్లర్ అయిన 'పఠాన్', మాస్ ఎంటర్‌టైనర్ 'జవాన్', సోషల్ కామెడీ 'డుంకీ' అనే మూడు భారీ చిత్రాలలో షారుఖ్ ఖాన్ నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలతో ఫ్లాపుల్లో షారుఖ్ ఖాన్ కూడా హిట్స్ అందుకుంటాడని భావిస్తూ ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా ఉండబోతోంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటిని తీసుకోవాలని అనుకున్నారు కానీ.. షెడ్యూల్ సమస్యల కారణంగా మేకర్స్ విజయ్ సేతుపతిని ప్రధాన విలన్‌ పాత్ర చేయాలని కోరినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News