రిలీజ్ కు ముందే కన్నప్ప సినిమా బయటకు వచ్చేసే ప్రమాదం?

‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను దొంగిలించారట.

Update: 2025-05-27 09:30 GMT

‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను దొంగిలించారట. చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌. కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ ఇటీవల కొరియర్ ద్వారా ఫిలింనగర్‌‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది.


ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్శిల్‌ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌బాయ్‌ రఘు అందుకున్నాడు. రఘు ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఈ ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Tags:    

Similar News