"విజిల్ మహాలక్ష్మి"గా కృతి శెట్టి

తమిళ డైరెక్టర్ లింగుస్వామి - యంగ్ అండ్ ఎనర్జిటిక్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్.

Update: 2022-02-14 10:47 GMT

మొదటి సినిమా "ఉప్పెన" తోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది కృతిశెట్టి. అందం, అభినయం, ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును పిచ్చివాళ్లని చేస్తుంది. ఉప్పెనతో భారీ హిట్ కొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి చేతిలో.. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో నిలిచింది కృతిశెట్టి.

తమిళ డైరెక్టర్ లింగుస్వామి - యంగ్ అండ్ ఎనర్జిటిక్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ది వారియర్ సినిమాలో కృతి లుక్, క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. కృతి శెట్టి జీన్స్, టీ షర్ట్ వేసుకుని కూల్‏గా స్కూటర్ నడుపుతూ కనిపించింది. విజిల్ మహాలక్ష్మిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు కృతి రెడీ అవుతుందంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు. కాగా.. రామ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నటుడు ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ది వారియర్ చిత్రానికి.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Tags:    

Similar News